రవితేజ పక్కన నటించడం ఇష్టం లేక సినిమా తప్పుకున్న స్టార్ హీరోయిన్..?
మాస్ రాజా రవితేజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు. గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు.
అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికి ఓ హీరోయిన్ ఆయనతో చేయడం ఇష్టం లేక సినిమా నుంచి తప్పుకున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రవితేజ హీరోగా, త్రినాధరావు దర్శకత్వంలో 'ధమాకా' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారట. త్రినాధరావు రష్మికతో సంప్రదింపులు కూడా జరిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ, రష్మిక కాకుండా శ్రీలీలను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. రవితేజ , శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటంతో విమర్శలు కూడా వచ్చాయి.

అయితే తెర మీద వీరి జోడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రవితేజతో నటించడం ఇష్టం లేకనే రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆమె బాలీవుడ్‌లో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం వల్ల రష్మిక రవితేజ సినిమాకు నో చెప్పిందని తర్వాత తెలిసింది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న రవితేజకు 'ధమాకా' సూపర్ హిట్‌గా నిలిచింది. 'ధమాకా' ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. రవితేజ, శ్రీలీల మధ్య భారీ ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ.. వీరి జోడి మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో రవితేజ, శ్రీలీల జంటగా ఇటీవల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications