శృంగారం సీన్‌లో ఇన్వాల్వ్ అయ్యి రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్..!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేఖ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. కేవలం తన నటనకే కాకుండా తన ధైర్యం, స్టైల్ వంటి అంశాలతో కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఆమె తెరపై చూపించిన అబ్బురపరిచే ప్రెజెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.
తెలుగు సినిమాతోనే కెరీర్ స్టార్ట్..
రేఖ కెరీర్ తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది. ఆమె 1958లో 'ఇంటి గుట్టు' చిత్రంతో బాలనటిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 1966లో తన తల్లి పుష్పవల్లితో కలిసి 'రంగులరాట్నం' సినిమాలో 'బేబీ భానురేఖ'గా నటించారు. ఈ సినిమా ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి, పలువురు దర్శకుల దృష్టిలో పడేలా చేసింది.

బోల్డ్ పాత్రలు..
రేఖ తన కెరీర్‌లో పలు బోల్డ్ పాత్రలను పోషించారు. గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో వచ్చిన పీరియడ్ డ్రామా 'ఉత్సవ్' (1984) వాటిలో ఒకటి. ఈ సినిమా సంస్కృత నాటకం 'మృచ్ఛకటిక' ఆధారంగా రూపొందింది. ఇందులో రేఖ వసంతసేన పాత్రలో జీవిస్తూ, ప్రేమ, శృంగారం, ద్రోహం వంటి ఎలిమెంట్స్‌ను అద్భుతంగా పలికించారు. ఈ చిత్రంలోని ఇంటిమేట్ సన్నివేశాలలో ఆమె చూపిన ఎక్స్‌ప్రెషన్స్ 80వ దశకంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.
శృంగారం సీన్‌లో ఇన్వాల్వ్..
అలాగే, 1997లో బసు భట్టాచార్య దర్శకత్వంలో వచ్చిన 'ఆస్థ' చిత్రం రేఖ కెరీర్‌లో మరో డేరింగ్ అటెంప్ట్. ఇందులో ఆమె ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో నటించి, డబ్బు అవసరం కోసం వ్యభిచారంలోకి దిగాల్సి వస్తుంది. ఈ చిత్రం సమాజానికి డబ్బు, బంధాలు మరియు విలువలపై ప్రశ్నలు వేసింది. హీరో ఓం పురితో ఆమె కెమిస్ట్రీ, ముఖ్యంగా ఇంటిమేట్ సన్నివేశాలు 90వ దశకంలో సంచలనం సృష్టించాయి. ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఇద్దరూ పాత్రల్లో ఎంతగా లీనమయ్యారంటే, వారు కూర్చున్న కుర్చీ విరిగిపోయి సెట్‌లోని అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఆ వ్యవహారం అప్పట్లో ఫుల్ సెన్సేషన్ అయ్యింది.

మరోవైపు రేఖ కేవలం బోల్డ్ పాత్రలకే పరిమితం కాకుండా అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించారు. ఆమె నటనకు గాను అనేక జాతీయ అవార్డు నామినేషన్లు కూడా లభించాయి. రేఖ ఇప్పటికీ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ఐకానిక్ ఫిగర్‌గా నిలిచి ఉన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications