బిజినెస్‌మెన్ తో తెలుగు స్టార్ హీరోయిన్ పెళ్ళి?

తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ఉంటారు. కొందరు లోకల్ అయితే.. మరికొందరు నాన్ లోకల్ గా ఉంటారు. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. అచ్చ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడంలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. భాష, ప్రాంతీయతో సంబంధం లేకుండా కొందరు హీరోయిన్లు మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగువారి అభిమానాన్ని చూరగొంటుంటారు. అటువంటివారిలో సదా ముందుంటారు.

కెరీర్ లో సదా అనేక సినిమాలు చేసింది. కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో నటించిన సదా ఆ తర్వాత పరిశ్రమలో మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పెద్ద హీరోల సరసన సినిమాలు చేసింది. తన నటన, అందంతో ఆకట్టుకున్న సదా ఎన్నో విజయవంతమైన చిత్రాలను చేసింది.

star heroine sadha getting marriage with tamil nadu businessman

అపరిచితుడు సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదంటని సోషల్ మీడియాలో అభిమానులు సదాను ప్రశ్నిస్తుంటారు. బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారుకదా.. చేయనివ్వండి అని మరికొందరు అభిమానులు కామెంట్లు పెడుతుంటారు. కొన్నాళ్ల క్రితం తమిళ హీరో మాధవన్ తో సదా ప్రేమాయణం నడిపిందంటూ వార్తలు వచ్చాయి. నాలుగు సంవత్సరాలపాటు వీరు ప్రేమించుకున్నారు. ప్రియసఖి, నాన్ అవనాలు సినిమాల్లో కూడా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ అనివార్య కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం హీరోయిన్ సదా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్తను సదా వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లికి సదా కూడా ఒప్పుకున్నారని, ఇంట్లో పెద్దలు ఈ సంబంధం కుదిర్చారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కాస్తంత ఆలస్యంగానైనా సదా వివాహ బంధంలోకి అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+