మిలమిల మెరుస్తున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. 'ఏమాయ చేసావే'తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. అప్పటినుంచి ఎన్నో చిత్రాల్లో తనదైన గ్లామర్ పాత్రలను చేసి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఆమె తన పంథాను మార్చుకుంది. ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలనే చేసుకుంటూ వస్తోంది. ఇలా అనేక విజయాలను సాధించింది.
విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో వరుగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో సందడి చేస్తోంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో తాను చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్రతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. చూపు తిప్పుకోనివ్వని అందం, మరిపించే నటనతో దాదాపు 16 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా హవాను చూపిస్తోంది.

టాలెంటెడ్ హీరోయిన్ అయిన సమంత గతంలో కంటే ఈ మధ్యకాలంలో తన రేంజ్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. ఈ భామ వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో గాలిపటం ఎగురవేసింది.
తన ఫ్లాట్ టెర్రస్ పైన గాలిపటం ఎగురవేస్తూ అందుకు సంబంధించిన అందమైన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. ఈ ఫొటోల్లో తన క్యూట్ స్మైల్ తో అందరినీ ఆకర్షించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్ కథలను వింటోంది. నచ్చినవాటికి సైన్ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications