త్వరలోనే హీరోయిన్ త్రిష వివాహం? వరుడు ఎవరంటే..
హీరోయిన్లలోనే అందమైన క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న త్రిష త్వరలోనే వివాహం చేసుకోబోతందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆరా తీయగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. తన రెండో ఇన్నింగ్స్ ను అద్భుతంగా ప్రారంభించిన త్రిష తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో కూడా అంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో త్రిషను ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా బ్యూటీ రహస్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
పెళ్లి పీటల వరకు వెళ్లలేదు
గతంలో ఇద్దరు ముగ్గురు హీరోలతో త్రిష రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయికానీ అవేవీ పెళ్లిపీటల వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం చేసుకోబోతందంటున్నారుకానీ వాటిల్లో వాస్తవం లేదని అర్థమైంది. తన పెళ్లిపైనే మీడియాకు, మిగతావారికి బాగా ఆసక్తిగా ఉందని, దేశంలో తన పెళ్లి మాత్రమే పెద్ద సమస్యగా ఉందా? మరే సమస్యలు కనపడటంలేదా? అని ప్రశ్నిస్తోంది. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోవడంలేదు అని స్పష్టంగా, గట్టిగా చెప్పింది ఈ అమ్మడు. ఇప్పటికే మీడియా చాలాసార్లు తనకు పెళ్లి చేసిందని, పెళ్లికి ఇప్పుడు తొందరేం లేదని, తాను సంతోషంగా ఉండటం ఇష్టం లేదా? అని ప్రశ్నించింది. తాను ఇలా ఉండటంవల్ల ఎవరికి నష్టమంది. తనను ఇలా ఉండనివ్వాలని సూచించింది. తాను పెళ్లి చేసుకునే రోజు వస్తే తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటానన్నారు.

కుర్ర హీరోయిన్లకన్నా ధీటుగా
తెలుగులో ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తోంది. మరో రెండు సినిమాలకు సంబంధించి కథలు వింటోంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళంలో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్లకన్నా ధీటుగా ఎక్కువ సినిమాలు చేస్తోంది. కాల్షీట్లు కూడా రెండు సంవత్సరాల వరకు ఖాళీలేవు. అలాగే మళయాళంలో ఓ సినిమా చేస్తోంది. శింబుతో రిలేషన్ లో ఉందని కొన్నాళ్లు, రానాతో అని మరికొన్నాళ్లు, సిద్ధార్థ్ తో అని మరికొద్దిరోజులు వార్తలు వచ్చాయికానీ, చివరకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందికానీ అది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు.












Click it and Unblock the Notifications