5 కోట్లతో తీసిన చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద సుసు పోయిస్తోంది..!

ప్రస్తుతం పాన్ ఇండియా కాలం నడుస్తోంది. బాహుబలి, పుష్ప తర్వాత పాన్ ఇండియా మూవీస్ పెరిగిపోయాయి. హిట్స్ తో సంబంధం లేకుండా ప్రతి మూవీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. కానీ ఏటా ఒకటి, రెండు చిత్రాలు మాత్రమే పెట్టిన డబ్బును వెనక్కు తెచ్చేసుకుంటున్నాయి. మిగితావి మాత్రం ప్లాఫ్ లు గానే మిగిలిపోతున్నాయి. అయితే ఈ రోజుల్లో చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన మహావతార్ నరసింహ మూవీ రూ. 15 కోట్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

అలాగే కన్నడలో సు ఫ్రమ్ సో కూడా చిన్న సినిమాగా బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ కన్నడ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి శెట్టి నిర్మాతగా వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా నాలుగున్నర కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కింది. రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రాజ్ బి శెట్టితో పాటు ఈ మూవీలో జేపీ తుమ్మినాడు, శనిల్ గౌతమ్ తదితరులు నటించారు. తాజాగా ఈ మూవీ తెలుగులోనూ రిలీజై అలరిస్తోంది. ఈ మూవీకి క్రమంగా బుకింగ్స్ పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు లో గ్రాండ్ రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోతుంది.

Su From So Kannada Film Made on Rs 5 Crore Budget Grosses Over Rs 60 Crore

ఇక ఈ చిత్రానికి దుమినాద్ దర్శకత్వం వహించారు. మహావతార్ నరసింహా మూవీతో పాటు ఈ సినిమా కూడా జులై 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కించారు. కేవలం రూ. 5 కోట్లతోనే ఈ మూవీ తెరకెక్కింది. కానీ ఇప్పుడు కన్నడలో రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా దూసుకెళ్తోంది. మరి ఇటీవల తెలుగులో కూడా రిలీజైన ఈ మూవీ తెలుగులో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+