అడ్డంగా బుక్ అయిన మహేష్ బాబు.. సీక్రెట్ లీక్ !
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వచ్చిన వారిలో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తమదైన శైలిలో రాణించి మెప్పించారు. ఇక కృష్ణ అయితే 300 కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు. డేరింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.
ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. రమేష్ బాబు హీరోగా నటించిన 'నీడ' (1979) అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. అప్పుడు అయన వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.

ఈ క్రమంలోనే కృష్ణ స్టార్ హీరోగా చేసిన "కొడుకు దిద్దిన కాపురం" సినిమాలో మహేష్ కూడా నటించారు. అయితే అందులో రౌడీలతో ఫైటింగ్ చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో బైక్ స్టంట్స్ చేయాల్సి ఉందట. కాగా డూపును పెట్టుకొని ఆ స్టంట్స్ చేయమని కృష్ణ సూచించారట. కానీ మహేష్ మాత్రం డూప్ లేకుండానే చేస్తానని ఫైట్ మాస్టర్ కి చెప్పారట. మరుసటి రోజు 9 గంటలకు తన షూటింగ్ ఉండడంతో.. ఆ సమయానికి ఫైట్ సీక్వెన్స్ కూడా చేద్దాం అని చెప్పారట కృష్ణ.
కానీ మహేష్ మాత్రం డూప్ లేకుండా తనే స్టంట్స్ చేయాలని.. కృష్ణ అక్కడ ఉంటే స్టంట్స్ చేయడానికి ఒప్పుకోరని.. ఫైట్ మాస్టర్ ని బతిమిలాడి.. ఆరు గంటలకే వచ్చి ఆ స్టంట్స్ ఓన్ గా చేసేశారట. తర్వాత ఆ విషయం తెలుసుకున్న కృష్ణ.. మహేష్ మీద చేసిన పనికి కోపం వచ్చినా కూడా.. ఆ స్టంట్స్ చూసి ముచ్చట పడ్డారట. ఇకపై రిస్కీ స్టంట్స్ ఓన్ గా చేయొద్దని సూచించారట. ఈ విషయాన్ని గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.
రీసెంట్ గానే మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అప్ డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి.. సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025












Click it and Unblock the Notifications