రవితేజ చేయనంటే మూడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన మహేష్‌బాబు
సూపర్ స్టార్, అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివరకు లేదంటే తర్వాత ఏడాది ప్రారంభంలోకానీ మొదటి భాగాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి స్వరాలందిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి దీన్ని హాలీవుడ్ స్థాయికన్నా ఎక్కువగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాపై హాలీవుడ్ లోనే భారీ అంచనాలున్నాయి.
చిన్న చిన్న మార్పులు చేసిన పూరీ
ఇదిలావుంటే మహేష్ బాబు తన కెరీర్ లో కొన్ని ఇండస్ట్రీ హిట్లు అభిమానులకు, సినీ ప్రియులకు అందించారు. అయితే చిత్రంగా మూడు సినిమాలు మాత్రం ముందుగా రవితేజ దగ్గరకు వెళ్లాయి. తను వద్దంటే మహేష్ బాబు చేసి భారీ హిట్లను సొంతం చేసుకున్నారు. ముందుగా పోకిరి చిత్రం పూరీ రవితేజతో చేద్దామనుకున్నాడు. అయితే రవితేజ తిరస్కరించడంతో పూరీ ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందించాడు. అలాగే శ్రీను వైట్ల దూకుడు కథను రాసుకున్నారు. రవితేజతో అతనికి మంచి సన్నిహితత్వం ఉంటుంది. కథ కూడా రవితేజకు బాగా నచ్చింది.

మూడు సినిమాలను అందించిన రవితేజ
అయితే వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్ల దీన్ని చేయడం కుదర్లేదు. దీంతో శ్రీను వైట్ల ఈ సినిమాను మహేష్ బాబుకు చెప్పి ఒప్పించి అతి పెద్ద భారీ హిట్ ను అందించాడు. ఈ సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించింది. కొరటాల శివ శ్రీమంతుడు కథను ముందుగా రవితేజకే వినిపించారు. భద్ర సినిమాకు రచయితగా పనిచేసే సమయంలోనే లైన్ వినిపించగా చేద్దామన్నారు. అయితే మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల తర్వాత శ్రీమంతుడు సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించారు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది. ఇలా మూడు ఇండస్ట్రీ హిట్లను రవితేజ మహేష్ బాబుకు అందించాడు












Click it and Unblock the Notifications