'గుంటూరు కారం'తో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహేష్‌బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబును బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరినీ థియేటర్లకు రప్పించగలిగే ఏకైక హీరో కావడమే అందుకు కారణం. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా ఫ్లాపై అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి చెత్త సినిమా తీశాడు.. అతనికి బుర్ర ఉందా? అంటూ ప్రిన్స్ అభిమానులు డైరెక్టర్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. వీరి దెబ్బకు కొన్నాళ్లు మీడియా ముందుకు కూడా త్రివిక్రమ్ రాలేదు. తన తర్వాత సినిమాను అల్లు అర్జున్ తో చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మీడియా సమావేశాల్లో, సినీ కార్యక్రమాల్లో కనపడుతున్నాడు.
త్వరలోనే 1 బిలియన్ క్లబ్ లో చేరబోతున్నాడు
గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట యూట్యూబ్ లో ప్రపంచవ్యాప్తంగా 527 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. మూడు మిలియన్ల లైక్స్ వచ్చాయి. త్వరలోనే 1 బిలియన్ క్లబ్ లో చేరబోతోందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాప్-5 పాటల్లో కుర్చీ మడతపెట్టి పాట కూడా ఒకటిగా నిలిచింది. విదేశీయులు కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి నటులు డ్యాన్సులు బాగా వేస్తారు. వారందరినీ తోసిరాజని మహేష్ బాబు వేసి స్టెప్పులు ఇంతలా అలరించడం ప్రిన్స్ అభిమానులు కూడా ఊహించలేకపోయారు. తమ హీరో నుంచి ఇటువంటి ప్రపంచ రికార్డు వస్తుందని వారు భావించలేదు.

పది సంవత్సరాల్లో ఇదే మొదటి పాట
మహేష్ బాబుతోపాటు శ్రీలీల కూడా ఈ పాటలో తన డ్యాన్స్ సూపర్ గా వేసిందని చెప్పొచ్చు. గత పది సంవత్సరాల కాలంలో మహేష్ బాబుకు ఈ స్థాయి సూపర్ హిట్ పాట పడటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. గతంలో మణిశర్మ సంగీత దర్శకుడిగా ఉన్న సినిమాలన్నింటిలో మహేష్ బాబుకు అన్నీ బ్లాక్ బస్టర్ పాటలు పడేవి. తర్వాత ఎప్పుడైతే మణిశర్మ దూరమయ్యాడో మహేష్ బాబు నుంచి మ్యూజికల్ హిట్స్ రావడం కూడా మానేశాయి. ఓటీటీలో, టీవీల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా గుంటూరు కారం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీన్నిబట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ రానురాను ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications