మహేష్ బాబుకు ఇష్టమైన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను, అభిమానులను పలకరించాడు. కానీ ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలిలో ఎటువంటి డైలాగులు లేవు.. సన్నివేశాలు లేవు.. డ్యాన్స్ లు, నటన పరంగా మాత్రం బాగా చేశాడు. శ్రీలీల కథానాయికగా మెప్పించినప్పటికీ ఆ క్యారెక్టర్ లో పూజా హెగ్డే అయితేనే బాగుంటుందని ఓటీటీలో ఈ సినిమాను చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో మహేష్ బాబు నటించాడు. కొందరితో రెండు సినిమాలు, మరికొందరితో మూడు సినిమాలు చేశాడు. నమత్ర శిరోద్కర్, సోనాలి బింద్రే, త్రిష, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ, సమంత, కాజల్ అగర్వాల్, రష్మిక, శ్రీలీల, పూజాహెగ్డే లాంటి బ్యూటీతో నటించాడు. వీరందరితో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన పక్కన నటించిన హీరోయిన్లలో త్రిష అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ఆమెతో స్క్రీన్ స్పేస్ బాగుంటుందని, సన్నివేశాల్లో చాలా సులువుగా నటించవచ్చన్నారు.

ఆమెతో ఉన్న స్నేహం కూడా ఒక కారణమన్నారు. ఆ తర్వాత స్థానంలో సమంతతో నటించడానికి ఇష్టపడతానన్నారు. వీరిలో తన భార్య నమ్రత పేరు మాత్రం చెప్పలేదు. ఈ విషయంపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన మేకోవర్ పై మహేష్ బాబు దృష్టిపెట్టారు. దాదాపు మూడు సంవత్సరాల సమయం పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications