మా అమ్మకు అలాంటి అంకుల్స్ కావాలి

సురేఖావాణి... పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. నటిగా సురేఖావాణికి మంచి గుర్తింపు ఉంది. అమ్మగా, అక్కగా, వదినగా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. సురేఖావాణి వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది. ఆమె ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. సినిమాల్లో రాని గుర్తింపు ఆమెకు సోషల్ మీడియా ఇచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో సురేఖావాణిని ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉన్నారంటే అమ్మడు రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో సురేఖావాణికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా సురేఖావాణి అందాలు ఆరబోయడం అప్పట్లో సంచలనంగా మారింది. వయసు పెరుగుతున్నా తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తున్నారామె. అందంలో కూతురు సుప్రీతతో పోటీ పడుతూ హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.సురేఖావాణి కూతురు సుప్రీత ఇటీవల హీరోయిన్‌గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా చేస్తున్న కొత్త సినిమాలో సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది.

Surekha Vani s Daughter Supritha about mother second marriage

ఇదిలా ఉంటే సురేఖావాణి భర్త అనారోగ్యంతో మరణించారనే విషయం అందరికి తెలిసిందే. ఇక సురేఖావాణి రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఓ ప్రముఖ దర్శకుడుని సురేఖావాణి పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ వైరల్ అయింది. తన పెళ్లిపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టారమె. తాను ఎవర్ని పెళ్లి చేసుకోవడం లేదని..అలాంటిది ఏమైనా ఉంటే తానే వెల్లడిస్తానని సురేఖావాణి చెప్పుకొచ్చారు. తన తల్లి సురేఖావాణికి రెండో పెళ్లి చేయాలని సుప్రీత ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దీనిపై మరోసారి మాట్లాడారామె.

ఇటీవల ఓ షో కు హాజరైన సుప్రీత.. తన తల్లికి మళ్లీ పెళ్లి చేయలనే ఆలోచనను బయటపెట్టింది. ఈ సమయంలో సుప్రీత మాట్లాడుతూ..అమ్మను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని.. అంకుల్స్ అయితే తన తల్లికి కరెక్టుగా సెట్ అవుతారని కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బాగా చూసుకోవాలని, టాక్సిక్ గా అస్సలే ఉండకూడదని చెప్పుకొచ్చింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తన తల్లికి పెళ్లి చేస్తా అని తెలిపింది. గతంలో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని కానీ అతను చాలా టార్చర్ చేశాడని తెలిపింది.దీంతో అతనికి బ్రేకప్ చెప్పానని సుప్రీత చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+