మా మధ్య చిచ్చు పెట్టింది పవన్ కల్యాణే..!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుస్మిత బయటకు పెద్దగా కనిపించకపోయినప్పటికీ, ఒక సెలబ్రిటీ కూతురిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె కేవలం సినీ కుటుంబంలో పుట్టినందున మాత్రమే కాదు, తన టాలెంట్ మరియు అభిరుచితో అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె ప్రధానంగా సినీ రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రవేశించారు.
తన తండ్రి చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', 'సైరా నరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడమే కాకుండా, సుస్మిత 'బ్రాండ్ అవేకనింగ్' అనే పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆమె 'షూట్‌అవుట్ ఎట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్‌ని నిర్మించారు. ఈ సిరీస్ ప్రేక్షకులను, విమర్శకులను కూడా ఆకట్టుకుంది.

ఇటీవల, సుస్మిత కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వంభర' సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సుస్మిత తన సోదరుడు రామ్ చరణ్‌తో కలిసి పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా ఒక టీవీ షోలో సుస్మితచేసిన వ్యామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి యాంకర్ సుధీర్ అడిగినప్పుడు, మేమంతా చిన్నప్పటి నుండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమని చెప్పారు.
అయితే, తనకి, రామ్ చరణ్‌కి మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ బాబాయ్ అని సుస్మిత నవ్వుతూ చెప్పారు. అప్పట్లో టీవీలో ఇప్పుడున్నంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది కాదు. కాబట్టి, బాబాయ్‌కి బోర్ కొట్టినప్పుడల్లా, ఏదో ఒక చిచ్చు పెట్టేవాడు. అది చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేసేవాడని సుస్మిత చాలా సరదాగా వివరించారు.
ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీలోని ఆత్మీయతను, చిలిపి అల్లరిని చూపిస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్వభావం ఎంత సరదాగా ఉంటుందో ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications