విజయ్ దేవరకొండలా ఉన్నావ్ అన్న నెటిజన్..దిమ్మతిరిగే కౌంటరిచ్చిన తమన్నా
హీరోయిన్ తమన్నా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.
ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసిన నెటిజన్‌కు తనదైనశైలిలో కౌంటరిచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి బ్లాక్ టీషర్ట్ ధరించి, తలకి క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. ఇందులో ఓ కామెంట్ కూడా ఉంది. డ్రెస్ విజయ్ దేవరకొండలా వేసుకున్నావ్. కానీ కనిపించడానికి ఊసరవెళ్లి సినిమాలో తమన్నాలా ఉన్నావ్ అని కామెంట్ పెట్టాడు.

దీన్ని ఆ నెటిజన్ తమన్నాకు ట్యాగ్ చేశాడు. ఆ నెటిజన్ పోస్ట్‌పై స్పందించిన తమన్నా అతనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. సింపుల్‌గా క్లోజ్ అని చెబుతూ, నోరు తెరిచి ఉన్న ఎమోజీని పంచుకుంది. నోరు మూసుకో అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో సదరు నెటిజన్ దెబ్బకు సైలెంట్ అయ్యాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications