ప్రియుడుకు తమన్నా గుడ్ బై ..హార్ట్ బ్రేక్ అయిందంటూ కామెంట్
హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి.రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా..అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు.
దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెబుతారా అని మీడియా వేసిన ప్రశ్నకు ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా లవర్ విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఇప్పట్లో ఆ ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చింది. ఇక ఇదే సమయంలో తమన్నా చేసిన కామెంట్స్ మరెన్ని అనుమానాలకు తెరతీసింది. తమన్నా తాజాగా ఇంటర్య్వూలో తన బ్రేకప్ స్టోరీస్ గురించి వివరించింది.
ఇప్పటి వరకు నా హృదయం రెండుసార్లు ముక్కలైందని మిల్కీ బ్యూటీ తెలిపింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. మొదటిది టీనేజ్‌లో ఉన్నప్పుడు జరిగింది. కొత్త విషయాలు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం.ఆ కారణం వల్ల ఫస్ట్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాను. కానీ నాకు అతను సెట్ కాదనిపించింది. ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పే వాళ్లంటే నాకు నచ్చదని తమన్నా తెలిపింది. అతను అలాంటి వాడని తెలియడంతో కొంత కాలానికి అతనికి బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తమన్నా కామెంట్స్ చేసింది విజయ్ వర్మ గురించేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications