నిమిషానికి కోటి.. 6 నిమిషాలకు 6 కోట్లు!
దక్షిణ భారత సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరైన తమన్నా భాటియా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతోనే కాకుండా స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లతోనూ ఆమె రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం 6 నిమిషాల ప్రదర్శన కోసం ఆమె ఏకంగా రూ.6 కోట్లు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
2026 న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా గోవాలోని బాఘా బీచ్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో తమన్నా తన డ్యాన్స్‌తో స్టేజ్‌ను హోరెత్తించారు. ఈ ప్రదర్శన కోసం ఆమె నిమిషానికి రూ.1 కోటి చొప్పున, మొత్తం 6 నిమిషాల పర్ఫార్మెన్స్‌కు రూ.6 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆమె ఎనర్జీ, గ్రేస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పారితోషికంపై చర్చ
సాధారణంగా ఓ స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాకు తీసుకునే పారితోషికం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. అయితే తమన్నా కేవలం కొన్ని నిమిషాల ప్రదర్శనకే ఇంత పెద్ద మొత్తం తీసుకోవడం ఆమె క్రేజ్‌ను తెలియజేస్తోంది. గతంలో ఆమిర్ ఖాన్ వంటి స్టార్లు చెప్పినట్లు.. పారితోషికం అనేది జెండర్ (లింగం) మీద కాకుండా, ఆ నటుడు థియేటర్లకు ఎంత మంది ప్రేక్షకులను తీసుకురాగలడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తమన్నా విషయంలో ఇది నిరూపితమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. 'జైలర్'లోని 'కావాలా', 'స్త్రీ-2'లోని 'ఆజ్ కీ రాత్' వంటి పాటలు గ్లోబల్ వైడ్‌గా హిట్ అవ్వడంతో తమన్నాకు లైవ్ షోల డిమాండ్ విపరీతంగా పెరిగింది.
భవిష్యత్తు ప్రాజెక్టులు
ప్రస్తుతం తమన్నా కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్, సౌత్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం 'ఓ రోమియో' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications