'బేబీ డాల్'కు కొత్త వెర్షన్?
ప్రముఖ నటి తమన్నా భాటియా తన సినీ ప్రయాణంలో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు తన గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మిల్క్ బ్యూటీ.. ఇప్పుడు హారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ప్రసిద్ధ హారర్ ఫ్రాంచైజీ 'రాగిణి ఎంఎంఎస్3'లో తమన్నా ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇది ఆమె సినీ కెరీర్‌కు ఒక కీలక మలుపు కానుంది. 'రాగిణి ఎంఎంఎస్3' ఈ సిరీస్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబడుతున్నట్లు సమాచారం. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న ఏక్తా కపూర్.. చివరికి ఒక సరికొత్త, వినూత్నమైన కథాంశాన్ని ఖరారు చేశారు. ఈ చిత్రం 2025 చివరి నాటికి షూటింగ్ ప్రారంభించుకోవచ్చని తెలుస్తోంది.
హారర్-కామెడీ ఫార్మాట్‌లో సరికొత్త అనుభవం
తమన్నాకు ఈ సినిమా కథ ఎంతగానో నచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏక్తా కపూర్ ఆమెకు ఈ కథను 'వన్' చిత్ర సెట్‌లో చెప్పినప్పుడు, దానిలోని కొత్త హారర్-థీమ్‌కు తమన్నా ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. గతంలో వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్' చిత్రాలు హారర్-ఎరోటికా ఫార్మాట్‌లో ఉండగా.. ఈసారి 'రాగిణి ఎంఎంఎస్ 3' హారర్-కామెడీగా రూపొందనుంది. ఇది ప్రేక్షకులకు భయంతో పాటు, హాస్యాన్ని కూడా పంచుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం 'బేబీ డాల్' పాటలాంటి మరో చార్ట్‌బస్టర్ మ్యూజిక్ నంబర్‌ను వెతికే పనిలో ఉన్నారు.

'రాగిణి ఎంఎంఎస్' గత చరిత్ర ఇలా..
రాగిణి ఎంఎంఎస్ (2011): ఈ ఫ్రాంచైజీ 2011లో రాజ్‌కుమార్ రావు, కైనజ్ మోట్వాలా ప్రధాన పాత్రల్లో ప్రారంభమైంది. ఇది హారర్ జానర్‌లో ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది.
రాగిణి ఎంఎంఎస్ 2 (2014): 2014లో సన్నీ లియోన్ నటించిన 'రాగిణి ఎంఎంఎస్ 2' విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో 'బేబీ డాల్' అనే పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇప్పుడు, 'రాగిణి ఎంఎంఎస్ 3' లో భయం, హాస్యం, మంచి సంగీతం కలగలిపి ప్రేక్షకులను అలరించనున్నాయి. గ్లామరస్‌గా కనిపించే తమన్నా, తన నటనతో ఈ హారర్-కామెడీ చిత్రంలో ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టి, నవ్విస్తారో చూడాలి. ఈ చిత్రం తమన్నా కెరీర్‌కు ఒక కొత్త దిశను చూపుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications