ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

టాలీవుడ్‌లో చాలమంది ఉన్నారు. కానీ మీరు చూస్తోన్న ఫొటోలో ఉన్న హీరోయిన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మాయిలందరూ కూడా ఆమెలా అందంగా ఉండాలని భావిస్తుంటారు. పలువురు హీరోలు సైతం ఆమెకు ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్ తమన్నా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.

ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

Tamannaah Bhatia Stunning Looks viral in social media

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తమన్నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి కొత్త ఏడాది అయిన తమన్నా పెళ్లి పీటలు ఎక్కుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+