తమన్నాకు లైంగిక వేధింపులు..కోరిక తీర్చమన్న స్టార్ డైరెక్టర్ ..?
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా స్టార్ తమన్నాకు లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అందరి హీరోయిన్ల మాదిరగానే తమన్నా కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారట. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలంటే కచ్చితంగా సదరు సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేదా ఆ మూవీకి సంబంధించిన ఎవరో ఒకరితో బెడ్ షేర్ చేసుకోవాల్సిందే.ఈ విషయాన్నిచాలామంది అంగీకరించారు కూడా. తమన్నా కెరీర్‌లో ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైందని తెలుస్తోంది.

తన సినీ కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు ఆమెను కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెట్టాలని చూశారట. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తాను అగ్రిమెంట్‌పై సంతకం చేయాలంటూ హోటల్ రూమ్‌కి పిలిచారట. దీనిపై తమన్నాకు అనుమానం రావడంతో హోటల్ రూమ్‌కి ఎందుకని ప్రశ్నించిందట. దీంతో ఆ డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించారట.
దర్శకులు, నిర్మాతలతో కమిట్ అయితేనే సినిమాలో ఛాన్స్ అని చెప్పడంతో..అసలు విషయం తెలుసుకున్న తమన్న ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఆ తర్వాత కూడా తమన్నాను ఆ డైరెక్టర్ చాలాసార్లు బలవంతం చేశారట . కానీ ఇండస్ట్రీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమన్నా సైలెంట్ అయిపోయిందట. తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా భయంగా ఉండేదట.అయితే ఇన్నాళ్ల కెరీర్‌లో తమన్నా ఎక్కడ కూడా తాను లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పకపోవడంతో..ఇదింతా రూమర్ అని ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications