అతనితో నటించడం అసౌకర్యంగా అనిపించింది.. స్టార్ హీరోపై తమన్నా సంచలన కామెంట్స్
హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.
తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది.పెళ్లి కాకుండానే వీరిద్దరు కలిసి ఒకే చోట కాపురం కూడా పెట్టేశారు. అయితే ఏం వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వీరి ప్రేమకు బ్రేక్ పడింది.

ఇదిలా ఉంటే తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తమన్నా తెలిపింది. అయితే ఇదే సమయంలో నన్ను అవమానించడానికి, నా నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ సౌత్ స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాం. అయితే ఆ హీరోతో చేయడానికి కొంత అసౌకర్యంగా అనిపించింది. వెంటనే దర్శక,నిర్మాతలకు విషయాన్ని తెలియజేశాను. సినిమా చేయలేనని తేల్చి చెప్పేశాను. దీంతో ఆ స్టార్ హీరో కోపం తెచ్చుకుని హీరోయిన్‌ను మార్చండని నాపై కేకలు వేశారు.
షూటింగ్‌లో అందరూ చూస్తుండగానే నాపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిన, నేను మాత్రం మౌనంగానే ఉన్నాను.ఆ తర్వాత రోజు షూటింగ్‌లో తనంతటతానే నా వద్దకు వచ్చి కోపంలో అలా ప్రవర్తించానిన క్షమాపణలు కోరాడని ఈ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే తనని ఇబ్బంది పెట్టిన హీరో పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ స్టార్ ఎవరా అని ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications