తమన్నాతో బ్రేకప్.. కొత్త బ్యూటీతో విజయ్ డేటింగ్ ?

సినీ రంగంలో ప్రేమలు, బ్రేకప్‌లు కొత్త విషయం కాదు. కానీ Vijay Varma - Tamannaah Bhatia జంట విడిపోవడం మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందాల భామ, కెరీర్ ఆరంభం నుంచే స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది.

తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారు. అనూహ్యంగా వారి రిలేషన్ ముగియడం చర్చనీయాంశమైంది. అయితే తమన్నాతో విడిపోయిన కొద్ది రోజులకే విజయ్ వర్మ మరో నటితో రిలేషన్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

tamannah-boy-friend-vijay-varma-dating-with-alia-qureshi-after-break-up-with-her-and-pics-goes-viral

ప్రేమ నుంచి బ్రేకప్ వరకు..

Lust Stories 2 షూటింగ్ సమయంలో విజయ్ - తమన్నా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో కూడా తమ బంధాన్ని పరోక్షంగా అంగీకరించారు. సోషల్ మీడియాలో కలిసి కనిపించడం, వెకేషన్ ఫోటోలు షేర్ చేయడం వల్ల ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే 2025 ప్రారంభం నుంచి విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉండటం వల్లే బ్రేకప్ జరిగిందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. తమన్నా తన సోషల్ మీడియా నుంచి విజయ్ ఫోటోలు తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

కొత్త రూమర్స్‌కు తెర..

ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒక జపనీస్ రెస్టారెంట్ వెలుపల ఆయన Alia Qureshiతో కలిసి కనిపించడం వైరల్ అయింది. ఇద్దరూ డిన్నర్ తర్వాత ఒకే కారులో వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ నటించిన Matka King ప్రాజెక్ట్‌లో అలియా ఖురేషి కూడా భాగమవ్వడం విశేషం. షూటింగ్ సమయంలో పెరిగిన పరిచయం వ్యక్తిగత బంధంగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.

విజయ్ వర్మ కెరీర్..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన విజయ్ వర్మకు టాలీవుడ్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. MCA (Middle Class Abbayi)లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌లో 'గల్లీ బాయ్', 'డార్లింగ్స్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మరి ప్రస్తుతం విజయ్ - అలియా డేటింగ్ వార్తలు కేవలం పుకార్లేనా? లేక నిజంగానే కొత్త బంధం మొదలైందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇద్దరూ అధికారికంగా స్పందించే వరకు ఈ వార్తలు ఊహాగానాలుగానే మిగిలే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+