47 ఏళ్ల వయసులో తల్లి అయిన నటి.. స్టార్ కమెడియన్ భార్యపై ట్రోల్స్
తమిళ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ జైలర్, డాక్టర్ తదితర డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కమెడియన్ తో పాటు మంచి డ్యాన్సర్ కూడా. అయితే తాజాగా ఆయన భార్య నటి సంగీత ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు. పాపను ఎత్తుకొని కింగ్ స్లీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నటి సంగీతను ఆయన 2023లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

ఇక ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్న రెడిన్.. 45 ఏళ్ల వయసులో తమిళ సీరియల్ నటి సంగీతను ప్రేమించారు అలా 2023 డిసెంబరులో వీళ్లిద్దరూ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో నటి సంగీత వయసు కూడా 45 ఏళ్లకు పైనే ఉన్నట్లు సమాచారం. ఇక గతేడాది డిసెంబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది ఈ జంట.
స్టార్ కమెడియన్ రెడిన్.. కంగువా, బ్లడీ బెగ్గర్, డీడీ రిటర్న్స్, బీస్ట్, హిట్లర్, శబ్దం, కొలమావు కోకిల, కంజూరింగ్ కన్నప్పన్.. తదితర సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేశాడు. ఆయన గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో జైలర్, డాక్టర్ చిత్రాలు ముందుంటాయి.












Click it and Unblock the Notifications