తండ్రి పేరు చెప్పుకొని స్టార్ హీరో అయ్యాడు.. లేకపోతే..!
భారతదేశంలో మనకు కమల్ హాసన్ లాంటి నటుడు ఎవరూ లేరు.. భవిష్యత్తులో ఆయన స్థాయిలో నటించేవారు ఎవరైనా ఉన్నారా? అని అందరూ చర్చించుకునేవారు. కానీ కమల్ హాసన్ వారసత్వాన్ని నిలబెడుతూ ప్రస్తుతానికి ఆయన స్థాయి నటుడు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా మరో కమల్ హాసన్ అవుతాడని పేరు తెచ్చుకుంటున్నారు తమిళ, తెలుగు స్టార్ హీరో సూర్య. ప్రతి సినిమాలో విభిన్నంగా నటిస్తూ, భిన్నమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్ గా కూడా విజయాలు అందుకుంటూ ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్నారు సూర్య. తమిళంలో ప్రముఖ నటుడు శివకుమార్ కొడుకు. నటన పరంగా ఆయనకు ఎంతో పేరుంది.
వచ్చామా.. చేశామా..
సూర్య సినిమాల్లోకి ప్రవేశించిన మొదట్లో కెరీర్ పై ఏమాత్రం శ్రద్ధ ఉండేదికాదు. షూటింగ్ కు వచ్చామా.. దర్శకుడు చెప్పింది చేశామా.. ఇంటికి వెళ్లి నిద్రపోమాయా.. అన్నట్లుగా ఉండేవారు. అటువంటి సూర్య జీవితాన్ని ప్రముఖ దివంగత నటుడు రఘువరన్ మలుపు తిప్పారు. శివ, సుస్వాగతం, మాస్.. లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. అటువంటి రఘువరన్ తో సూర్య ఓ సినిమా చేస్తున్నారు.

విపరీతంగా కోపగించిన రఘువరన్
ఆ సినిమా షూటింగ్ జరిగే సమయంలో నటనను సీరియస్ గా తీసుకోకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా కనపడుతుండటంతో రఘువరన్ కు విపరీతంగా కోపం వచ్చింది. అసలేమాత్రం శ్రద్ధ లేదని మండిపడుతుండేవారు. సూర్యకు రఘువరన్ ఓ సినిమాలో అన్నయ్యగా నటించారు. షూటింగ్ కి వెళ్ళడానికి రఘువరన్, సూర్య ఇద్దరూ ఒకరోజు ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో సూర్య చక్కగా నిద్ర పోతున్నాడు. దీంతో మండుకొచ్చిన రఘువరన్ సూర్యను వెంటనే నిద్ర నుంచి లేపి తండ్రి పేరు చెప్పుకొని ఎంతకాలం అవకాశాలు తెచ్చుకుంటావు.. కెరీర్ గురించి ఆలోచిస్తున్నావా, నిన్ను నువ్వు నిరూపించుకోవా అంటూ బాగా తిట్టారు. దీంతో ఆలోచనలో పడిన సూర్య నటనపై దృష్టిపెట్టి బాగా రాటుదేలారు. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఈరోజు పాన్ ఇండియా స్టార్ గా మారారు.












Click it and Unblock the Notifications