తెలుగు స్టార్ హీరోయిన్‌తో శింబు నిశ్చితార్థం... ఓకే చెప్పిన పెద్దలు
తమిళంలో స్టార్ హీరోగా ఉన్న శింబు గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. హీరోయిన్లతో ఆయనకున్న పరిచయాలు, ప్రేమలు పెద్ద సంచలనాలు సృష్టించాయి. సినిమాలకన్నా ఈ సంచలనాలవల్లే ఆయనకు ఎక్కువగా పేరు వచ్చింది. ఇటీవలే ఆయన తండ్రి టి.రాజేందర్ మాట్లాడుతూ తన కుమారుడు ప్రేమ వివాహమే అవుతుందని బహిరంగంగానే ప్రకటించారు. తన తండ్రి రాజేందర్ లా శింబు కూడా బహుముఖ ప్రతిభావంతుడని చెప్పొచ్చు. నటుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, దర్శకుడిగా , సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
థగ్ లైఫ్ లో ప్రధానపాత్ర
నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అయితే ఎందుకనే వారిద్దరికీ బ్రేకప్ జరిగింది. కారణం మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. వాస్తవానికి ఇద్దరికీ వివాహమైపోయినట్లేనని అందరూ భావించారు. ఆ తర్వాత హన్సికను ప్రేమించాడు శింబు. అదికూడా అంతే.. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీనికి మణిరత్నం దర్శకుడు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్
41 సంవత్సరాల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన శింబు నిధి అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా వచ్చాయి. 2021లో ఈశ్వరన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి డేటింగ్ వ్యవహారం ఇప్పుడు వైరలవుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అంగీకరించారని, పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది. పరోక్షంగా శింబు తండ్రి రాజేందర్ కొన్నాళ్ల క్రితమే తన కొడుకు ప్రేమ వివాహమే చేసుకుంటాడని ప్రకటించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications