సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేసిన "దళపతి".. ఇదే లాస్ట్ !!
దళపతి విజయ్.. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అని చెప్పాలి. తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే విజయ్ పేరే గుర్తొస్తుంది. చిన్న వయసులోనే బాల నటుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన విజయ్.. ఆ తర్వాత హీరోగా మారి.. ఇప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల్లో ఒకరుగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.
విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న జన్మించిన ఆయన.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ కుమారుడు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఇలా అన్ని రకాల చిత్రాలలో తనదైన శైలిలో మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గిల్లీ, తుపాకి, కత్తి, బిగిల్, మాస్టర్, లియో వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. తెరపై ఎనర్జీ, డ్యాన్స్, డైలాగ్ డెలివరీలో ఆయనకు సాటి లేరనే విధంగా మెప్పించి.. ముఖ్యంగా యువతలో అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

పొలిటికల్ ఎంట్రీ..
నటుడిగానే కాకుండా .. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపారు. తమిళనాట జరగబోయే ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ నటిస్తున్న చివరి చిత్రం " జన నాయగన్ ".
ఈ మూవీ షూటింగ్ పనులను పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంధి. ఈ మూవీ తర్వాత విజయ్ కంప్లిట్ గా సినిమాలకు దూరం అవ్వాలని ఫిక్స్ అయినట్టు.. సోషల్ మీడియాతో పాటుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడిచింది.
లాస్ట్ మూవీ..
ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాల నుంచి తప్పుకున్నట్లు విజయ్ అఫీషియల్ గా ప్రకటించేశారు. జన నాయగన్ మూవీ తర్వాత శాశ్వతంగా సినిమాలను వదిలేస్తున్నట్లు చెప్పేశాడు. మరో 30-35 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకు తగ్గట్టు గానే పొలిటికల్ గా మరింత యాక్టివ్ కానున్నారని సమాచారం. మరి విజయ్ చివరి సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications