దళపతి విజయ్ వదులుకున్న బ్లాక్‌ బస్టర్లు

దళపతి విజయ్ ఎంత పెద్ద హీరోయినప్పటికీ కథల విషయంలో అతడి లెక్క తప్పుతుంటుంది. అతడొక్కడనే కాకుండా ఏ హీరోకైనా ఇది వర్తిస్తుంది. కొన్ని కథలు నచ్చకపోవడం.. అవి వేరే హీరో దగ్గరకు వెళ్లడం.. సూపర్ హిట్ అవడంతోపాటు ఫ్లాపైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే తమిళంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న విజయ్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను వద్దనుకున్నాడు. కథ నచ్చక వదిలేసినవే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అవన్నీ సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.

సింగం సిరీస్ వదులుకున్నారు
సూర్య కెరీర్ లో సింగం సిరీస్ సూపర్ హిట్ అయింది. 2010లో సింగం 1 వచ్చింది. తర్వాత మరో రెండు వచ్చాయి. తెలుగుతోపాటు హిందీలో కూడా సంచలన విజయాలు సాధించాయి. అటువంటి సిరీస్ ను విజయ్ వదులకున్నాడు. 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా రికార్డులన్నీ తిరగరాసింది. ముధల్వన్ పేరుతో తమిళంలో దీన్ని విజయ్ తో తీయాలని దర్శకుడు భావించాడు. అయితే రాజకీయాలకు సంబంధం ఉన్న సినిమాలు చేయనని చెప్పడంతో అర్జున్ చేశాడు. ఇప్పుడేమో రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేకంగా పార్టీని కూడా స్థాపించాడు.

tamil star hero vijay missed block buster movies

సగం వినగానే వద్దన్నాడు
విక్రమ్, జ్యోతిక నటించిన సినిమా ధూల్. డైరెక్టర్ ధరణి మొదట విజయ్ కే చెప్పినా స్క్రిప్ట్ లో బలం లేదని నిరాకరించాడు. విడుదలైన తర్వాత సినిమా హిట్ అయింది. విశాల్ నటించిన పందెం కోడి సినిమా తెలుగు, తమిళంలో ఘనవిజయం సాధించింది. మొదటి సగం వినగానే విజయ్ దీన్ని నిరాకరించాడు. దీంతో దర్శకుడు లింగుస్వామి విశాల్ తో తీయగా పెద్ద హిట్ అయింది. మురుగదాస్ దర్శకత్వంలో ధీనా సినిమా వద్దనుకున్నాడు. అది అజిత్ ను పెట్టి తీయగా హిట్ అయింది. ఆటోగ్రాఫ్ సినిమాను విజయ్ తోపాటు ప్రభుదేవా, అరవింద్ స్వామికి దర్శకుడు చరణ్ వినిపించాడుకానీ వాళ్లు వద్దనడంతో తానే హీరోగా మారి హిట్ కొట్టాడు. తెలుగులో రవితేజ హీరోగా చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+