అడవిలో బిర్యాని వండిన తమిళ సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న పిక్స్..
తమిళ సూపర్ స్టార్ అజిత్ పేరు తెలియని వారుండరు. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నారు ఈ స్టార్ హీరో. ఇక, ఈయనకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాల్లో కూడా ఈయన బైక్ రైడింగ్‌లు చేశారు. చాలా సార్లు ఈ స్టార్ హీరో ప్రొఫెషనల్ రేసింగ్‌లో కూడా పాల్గొన్నారు. కేవలం ఇలాంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఈయన ప్రతి సీనిమాలో బైక్ ఛేజ్ సీన్ తప్పకుండా ఉండే ఉంటుంది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ నటుడు అడవిలో వంట కూడా చేస్తున్నారు. అది కూడా అందరూ ఎంతగానో ఇష్టపడే బిర్యాని వంటకం.
ప్రస్తుతం స్టార్ హీరో అజిత్ బిర్యాని వండుతున్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అజిత్ ప్రస్తుతం విదాముయార్చి అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ రావడంతో నటుడు అజిత్ తన స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్ వెళ్లాడు. ఓ అడవిలో సేదతీరిన వారంతా కాసేపు సరాదాగా గడిపారు.

Ride with Venus. It is #Ajith sir’s GAME #VidaaMuyarchi 🔥🔥🔥 pic.twitter.com/1vved9bWVp
— Ashok Surya (@AshokSuryaOff03) March 20, 2024
ఈ సమయంలో స్టార్ హీరో అజిత్ తన స్నేహితుల కోసం బిర్యానీ వండాడు. ఇక అజిత్ ఎంతో ఎంజాయ్ చేస్తూ బిర్యాని వండుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అజిత్ మూవీస్ విషయానికి వస్తే, ప్రస్తుతం 'విదాముయార్చి' సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత అజిత్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. బైక్ రైడింగ్‌లోనే కాకుండా వంటలు చేయడంలో కూడా అజిత్ సూపర్‌స్టార్ అని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.












Click it and Unblock the Notifications