త్రివిక్రమ్‌కు షాక్.. చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు పోలీసులు విచారణ చేస్తున్నారు. జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూపై సీరియస్‌గానే రియాక్ట్ అయింది.
అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. తాజా ఈ వివాదం మరింత ముదిరింది. హీరోయిన్ పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓ ట్వీట్ చేయడం జరిగింది.త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన చెందారు. పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పూనమ్ కౌర్ "మా" కు ఎందుకు ఫిర్యాదు చేసింది, ఎప్పుడు ఫిర్యాదు చేసింది తనకు తెలియదని అన్నారు. మా ఫిర్యాదు బాక్స్‌లో ఓ ఫిర్యాదు లెటర్ వేస్తే.. దానిపై ఏదైనా చర్యలు తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామని ఆయనపేర్కొన్నారు. ఇప్పటికైనా రాత పూర్వక ఫిర్యాదు చేస్తే... తగు చర్యలు తీసుకుంటామని పూనమ్ కౌర్‌కు తమ్మారెడ్డి భరోసా ఇచ్చారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications