“బట్టలు విప్పి డ్యాన్స్ చేయి!”: బాలయ్య హీరోయిన్‌కు ఘోర అవమానం?

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఎల్లప్పుడూ తన సెన్సేషనల్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సీనియర్ నటుడు నానా పటేకర్ సహా పలువురిపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించిన పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఓ సినిమా షూటింగ్ సెట్‌లో డైరెక్టర్ తన పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆమె ఆ ఇంటర్వ్యూలో వివరించారు.

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!
కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

"బట్టలు విప్పి డ్యాన్స్ చేయి" అంటూ డైరెక్టర్ కామెంట్స్
'చాక్లెట్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ సినిమాలో నీటి అడుగున ఓ డ్యాన్స్ సీన్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో డైరెక్టర్ నాతో మాట్లాడిన తీరు చాలా అసహ్యంగా ఉంది. డైరెక్ట్‌గా "బట్టలు విప్పి డ్యాన్స్ చేయి" అని అన్నారు. ఓ మిస్ ఇండియా విజేతతో గానీ, లేదా ఓ ప్రొఫెషనల్ నటితో గానీ మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఆ సీన్‌లో గౌన్ తొలగించాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని పద్ధతిగా, గౌరవప్రదంగా కూడా చెప్పవచ్చు. కానీ అతను చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు" అని తనుశ్రీ దత్తా వెల్లడించారు.

Tanushree Dutta Recalls Shocking Incident on Movie Set with Director offensive remarks during a shoot
విశ్వంభర అప్‌డేట్: దసరా కానుకగా మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్?
విశ్వంభర అప్‌డేట్: దసరా కానుకగా మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్?

ఆ సమయానికి తాను ఇండస్ట్రీకి కొత్త కావడంతో బహిరంగంగా గొడవ చేయలేకపోయానని, అయితే ఈ కామెంట్‌కు నిరసనగా డైరెక్టర్ వైపే తీవ్రంగా చూస్తూ సీన్‌ను పూర్తి చేశానని తనుశ్రీ దత్తా చెప్పుకొచ్చారు. సెట్‌లో ఉన్న మిగతా సిబ్బందికి కూడా ఆ మాటలు చాలా అభ్యంతరకరంగా అనిపించాయని ఆమె గుర్తు చేసుకున్నారు. "నేను ఇంటర్వ్యూలో సాధారణంగా ఈ విషయం చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ పేరు కూడా తీయలేదు. కానీ అతనే స్వయంగా ముందుకు వచ్చి వివరణలు ఇస్తూ ఇప్పటికీ ఆ విషయంపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు" అని తనుశ్రీ దత్తా ఆరోపించారు. కాగా 'చాక్లెట్' సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తనుశ్రీ దత్తా తెలుగులో బాలకృష్ణ నటించిన 'వీరభద్ర' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+