రామ్ చరణ్ "చికిరి" పాటకు స్టెప్పులు అదరగొట్టిన టీడీపీ నేత..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.
రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు చరణ్. వీడియో చివరలో క్రికెట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కాగా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి 'చికిరి చికిరి' పాటను రిలీజ్ చేశారు.

రెహమాన్ సంగీతం.. ఆ లిరిక్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేస్తుంటే.. చరణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఇంకొంచెం ఎక్కువ నచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో 75 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. సోషల్ మీడియాను సైతం ఓ ఊపు ఊపేస్తోన్న ఈ సాంగ్ కి యువతే కాకుండా రాజకీయ నేతలు కూడా ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ గా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పంతగాని నరసింహ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ అలరించారు.
రైల్వే కోడూరుకు చెందిన పంతగాని నరసింహ ప్రసాద్ ప్రస్తుతం టీడీపీ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దివంగత మాజీ ఎంపీ, నటుడు శివప్రసాద్‌కు ఈయన స్వయానా అల్లుడు. ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్‌లో తన సోదరుడు, భార్య, ఇతర బంధువులతో కలిసి 'చికిరి చికిరి' పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరదాగా నేను చేసిన డ్యాన్స్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోప్పడకండి రాసుకొచ్చారు. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వగా.. దర్శకుడు బుచ్చిబాబు ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ బాగుందంటూ కామెంట్స్ చేశారు.
🤩🤍🙏🏻🧿 https://t.co/MJlAKa7uMC
— BuchiBabuSana (@BuchiBabuSana) November 21, 2025
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఛీ ఏం మనుషులు మీరు.. మలయాళం బ్యూటీకి బిగ్ షాక్..?












Click it and Unblock the Notifications