'అఖండ 2' టికెట్ సేల్స్‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్.. కానీ ?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నందమూరి బాలకృష్ణ "అఖండ 2" మానియానే కనిపిస్తోంది. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికులను ఖుషి చేస్తూ అడ్డంకులు తొలగించుకొని డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 11వ తేదీ రాత్రి నుంచే ప్రేమేయర్ షోలు కూడా పడడంతో థియేటర్‌ల వద్ద బాలయ్య అభిమానుల సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక అఖండ 2 చివర్లో 'జై అఖండ' పేరుతో 'అఖండ 3' రానున్నట్లు టైటిల్స్ వేసి మూడో భాగం ఉండనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.
కాగా 'అఖండ' మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలు కొట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా ఐదో హిట్ కూడా కూడా అందుకున్నారని అభిమానులు చెబుతున్నారు. బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపం చూపించారని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే అఖండ-2' సినిమా టికెట్ల ధరల వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పెంచిన ధరలకే టికెట్లు అమ్మడంపై చిత్ర నిర్మాతలు, ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ బుక్‌మైషోను తీవ్రంగా హెచ్చరించింది. "కోర్టు ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా?" అని ఘాటుగా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిన్న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించారని, అధిక ధరలకే టికెట్లు విక్రయించారని ఆరోపిస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమకు కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్‌మైషో తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు.
అయితే ప్రస్తుతం కూడా పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అని కోర్టు నిలదీసింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus)కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించగా.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకూ డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
-
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు












Click it and Unblock the Notifications