Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూసేకి అగ్గిరవ్వే: గద్దర్ అవార్డుల జాబితా

Gaddar Awards: అల్లు అర్జున్ మరో ఘనతను సాధించారు. బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాతో టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఈ ఐకాన్ స్టార్.. ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి పడింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టిన గద్దర్ అవార్డు ఆయనకు దక్కింది.

ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారానికి ఎంపిక అయ్యారు అల్లు అర్జున్. గద్దర్ అవార్డుల జ్యూరీగా సీనియర్ నటి జయసుధ వ్యవహరించారు. మార్చి 13వ తేదీ నుండి ఈ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం.

Telangana Launches Gaddar Awards 2025 Icon Star Allu Arjun Wins Top Honour

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి అంటే 2014.. నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును జ్యూరీ ప్రకటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక అయ్యారు. ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ ఎంపిక అయ్యాయి.

నాగ్ అశ్విన్ కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. కల్కి 2898 ఏడీ చిత్రానికి ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపిక అయ్యారు. 35 చిన్నకథలు సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా తమిళ నటుడు ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సపోర్టింగ్ నటిగా శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఎంపిక అయ్యారు.ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది.

ఉత్తమ తొలి సినిమా దర్శకుడు- యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తు వదలరా), ఉత్తమ బాల నటుడు- మాస్టర్ అరుణ్ దేవ్- 35 చిన్న కథలు, ఉత్తమ బాల నటి- బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్) ఎంపికయ్యారు.

ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజు యాదవ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథరెడ్డి (గామి), ఉత్తమ గాయకుడు- సిద్ శ్రీరామ్ (నిజమే నే చెబుతున్నా- ఊరు పేరు భైరవకోన), ఉత్తమ గాయని- శ్రేయా గోషాల్ (సూసేకి అగ్గిరవ్వ మాదిరే- పుష్ప 2) సెలెక్ట్ అయ్యారు.

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), స్పెషల్ జ్యూరీ అవార్డ్- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), బెస్ట్ ఎడిటర్- నవీన్ నూలి (లక్కీ భాస్కర), బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - రజాకార్, ఉత్తమ సంగీత దర్శకుడు- భీమ్స్ సిసిలియో (రజాకార్), ఉత్తమ మేకప్- నల్లా శ్రీను (రజాకార్) ఉత్తమ కోరియాగ్రాఫర్- గణేష్ ఆచార్య (దేవర- ఆయుధపూజ పాట) దక్కించుకున్నారు. ఉత్తమ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా ఆయ్ ఎంపికైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+