ఎలక్షన్ కౌంటింగ్ వేళ కూడా.. డాన్స్ వీడియోతో సెగలు పుట్టిస్తున్న తెలుగు బ్యూటీ !!
దివి వద్త్య.. తెలుగు సినీ ప్రియులందరికీ సుపరిచితురాలు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, తన అందం, ఆత్మవిశ్వాసం, నటిగా సినీప్రవేశం చేసింది. 2019 లో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినా.. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత A1 ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాల్లో నటించింది. అయితే దివి నిజమైన గుర్తింపును తెచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాలిటీ షో అనే చెప్పాలి.
ఈ ముద్దుగుమ్మకి బిగ్‌బాస్ షోతో స్టార్ లెవల్ క్రేజ్ దక్కింది. ఈ ఫాలోయింగ్ తోనే దివికి వరుస ఆఫర్లు వచ్చాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు మహర్షి, అల్లు అర్జున్ పుష్ప-2 వంటి పెద్ద సినిమాల్లో కూడా అవకాశం దక్కింది. అంతే కాకుండా కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించింది.

రుద్రంగి మూవీ ఐటమ్ సాంగ్
సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రంగి సినిమాలో 'జాజిమొగులాలి' ఫోక్ సాంగ్ రీమేక్ చేశారు. ఇందులో దివి చేసిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన నడుము, డ్యాన్స్ మూవ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఇటీవల లంబసింగి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ అది పెద్దగా విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ సరైన బ్రేక్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది. తన ఎత్తు, ఫిజిక్, అందం ఇవన్నీ చూస్తే హీరోయిన్ మెటీరియల్ అనడం పక్కా.. అందుకే సరైన హిట్ పడితే అమ్మడు తగ్గేదే లే అంటూ ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
హాట్ లుక్స్, టాటూలతో సెన్సేషన్
దివికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.3 మిలియన్లకుపైగా అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ముఖ్యంగా తన ఛాతీపై ఉన్న టాటూ ఫోకస్ అయ్యేలా ఫొటోలు పెడుతూ యూత్‌ను రెచ్చగొడుతుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.
Divi Vadthya 🏀🥵 pic.twitter.com/8MXApbYzyY
— Mr. D ᴇ ᴠ ᴀ s ᴇ ɴ ᴀ (@RaashiSena) May 3, 2026












Click it and Unblock the Notifications