బిగ్ బాస్-8 సీజన్ విన్నర్ అతడే..!
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-8 సీజన్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభం అయింది. గత 105 రోజులుగా బిగ్ బాస్-8వ సీజన్ నిర్విరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది ఈ షో. ఆ తర్వాత మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి రప్పించి ఈ షోని మరింత రక్తి కట్టించారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది.
సీజన్ చివరి దశకు చేరుకునే సరికి టాప్-5లో అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిది,నిఖిల్,ప్రేరణ నిలిచారు. వీరిలో నిఖిల్ , గౌతమ్ కృష్ణలు ఫైనల్‌కు చేరారు. చివరకు బిగ్ బాస్-8 సీజన్ విన్నర్‌గా నిఖిల్ నిలిచారు. షో మొదటి నుంచి కూడా తన గేమ్‌తో అదరగొట్టిన నిఖిలే విజేతగా నిలిచాడు. ఓటింగ్ శాతంలో ముందంజలో ఉండటంతో నిఖిల్ బిగ్ బాస్-8గా విన్నర్ కాగలిగాడు. గౌతమ్ కృష్ణ, నిఖిల్‌కు గట్టి పోటినిచ్చాడు. ఒకనొక దశలో గౌతమ్ కృష్ణనే విన్నర్ అనే ప్రచారం కూడా జరిగింది.

కానీ ఓటింగ్ శాతం నిఖిల్‌కు ఎక్కువగా ఉండటంతో, అతనే విజేతగా నిలిచాడు. గౌతమ్ కృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్-8 సీజన్ గ్రాండ్ ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతని చేతుల మీదుగానే నిఖిల్ బిగ్ బాస్-8 సీజన్ విన్నర్ టైటిల్‌ను అందుకోవడం జరిగింది. నిఖిల్ విన్నర్ కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.నిఖిల్ బిగ్‌బాస్ ట్రోఫితో పాటు, రూ.55 లక్షలు రూపాయిలు ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు.












Click it and Unblock the Notifications