ఆ తెలుగు దర్శకుడు నా బాడీ ప్రైవేట్ పార్ట్ సైజు అడిగాడు.. హీరోయిన్ సంచలనం
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా ఓ హీరోయిన్ లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. మోడల్, నటి మౌనీషా చౌదరీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తనను సినిమాల్లో నటించమని బలవంతం చేశారని, వేధించారని ఆమె ఆరోపించింది.

ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారు. తన మూవీలోనూ నటించాలని నాకు ఆఫర్ కూడా ఇస్తానని చెప్పారు. కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలను కూడా అడిగి టార్చర్ పెట్టారు" అని మౌనీషా వెల్లడించింది.
అంతేకాకుండా ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారని ఆమె చెప్పడం మరింత చర్చకు దారితీసింది. అయితే మౌనీషా ఆ డైరెక్టర్ పేరు మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తూ, ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ ఆరోపణలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications