'నామాట వింటే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతావు'
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అయినా, హీరోయిన్ గా అయినా.. ఇలా ఏ విభాగంలో రాణించాలన్నా కచ్చితంగా టాలెంట్ ఉండాలి. అందరికంటే ముందుగా దూసుకుపోయే తెగింపు సొంతం కావాలి. ప్రధానంగా హీరోయిన్ గా వరుసగా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోవాలంటే సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయడంతోపాటు ఎవరికీ భయపడకుండా అందచందాలను ఆరబోయాల్సి ఉంటుంది. లేదంటే ఈ సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇటువంటివి ఇష్టంలేనివారు పరిశ్రమకు దూరమయ్యారు. మరికొందరు మాత్రం టాలెంట్ ను నమ్ముకొని రాణిస్తున్నారు.
మిల్క్ బ్యూటీ తమన్నా కు కూడా పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ప్రారంభంలో అవకాశాలు సరిగా రాలేదు. అయితే రచ్చ సినిమా చేసిన తర్వాత మాత్రం మెరుపువేగంతో దూసుకుపోయింది. రచ్చ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందు ఓ దర్శకుడు మాత్రం తమన్నాను టార్చర్ చేశాడు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే తనను సంప్రదించాలని సూచించేవాడు. తాను చెప్పినట్లు వింటే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ చేస్తానని, టాప్ హీరోయిన్ అవుతావంటూ బాగా ఇబ్బంది పెట్టారు.

అటువంటి టార్చన్ ను మౌనంగానే భరించానని తమన్నా తన సన్నిహితులకు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఇటువంటి వేధింపులను భరిస్తూ తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో కూడా తన హవాను చూపిస్తోంది. అందులో నటించేందుకు అందాలకు కూడా గేట్లెత్తోంది. తన ప్రియుడు విజయ్ వర్మను రేపో మాపో పెళ్లాడబోతోంది.












Click it and Unblock the Notifications