సినీ హీరోలు, దర్శకులు, రాజకీయ నేతల బినామీ మృతి
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతోపాటు రాజకీయ పార్టీ నేతలంతా కలిసి తమ డబ్బులను ఓ నిర్మాత ద్వారా దుబాయ్ లో పెట్టుబడి పెట్టించారు. పెట్టబడులన్నింటినీ అక్కడకు తరలించారు. ఆ నిర్మాత పేరు కేదార్ సలగంశెట్టి. అయితే అకస్మాత్తుగా అతను మృతిచెందాడు. గుండెపోటు అని చెబుతున్నప్పటికీ ఎవర నమ్మడంలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేదార మృతిపై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్నేహితుడు మరణించడం వెనక మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. కేదార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
సుకుమార్, విజయ్ దేవరకొండ తిరిగిచ్చేశారు
దర్శకుడు సుకుమార్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా తీయాలని వారిద్దరికీ కేదార్ భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరూ ఆ డబ్బును కేదార్ కు తిరిగిచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరణించిన తర్వాత ఇచ్చారా? మరణించకముందే ఇచ్చారా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కేదార మరణించినప్పుడు అక్కడ ఎవరున్నారు? అతని మృతదేహం భారత్ కు ఎప్పుడు వస్తుంది? అన్న విషయాలు కూడా ఏమీ తెలియరావడంలేదు. దుబాయ్ లో జరిగిన ఓ వేడుకకు హాజరైనప్పుడు తన ప్లాట్ లో మృతిచెందారు.

24 గంటల్లోగా బంధువులకు బాడీని అప్పగించాలి
వాస్తవానికి ఓ వ్యక్తి మరణిస్తే దుబాయ్ పోలీసులు 24 గంటల్లోగా సంబంధిత వ్యక్తులకు బాడీని అందజేస్తారు. కేదార్ విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. కారణాలను దుబాయ్ పోలీసులు చెప్పలేకపోతున్నారు. అతని కుటుంబ సభ్యులు కోరితే విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలతో కేదార్ కు లావాదేవీలున్నాయి. వారి తరఫునే ఆయన దుబాయ్ లో రియల్ ఎస్టేట్ తోపాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రస్తుతం ఆయన మరణించడంతో కేదార్ తో పెట్టుబడి పెట్టించినవారంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంలో ఏం చేయాలనేది వారికి అర్థం కావడంలేదు. కేదార్ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెట్టారు? వాటి వివరాలేంటి? ఇతర విషయాలన్నీ ఆయనతోనే సమాధి అయిపోయాయని పలువురు భావిస్తున్నారు. రాడిసన్ హోటల్ జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేదార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
-
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ???










Click it and Unblock the Notifications