తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ దొరికింది

తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలకు ఎప్పుడూ కొరత ఎదురవుతుంటుంది. అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కు హీరోయిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వారి వయసు రీత్యా చిన్న వయసులోనే హీరోయిన్లవుతున్నవారు సరిపోవడంలేదు. అలాగే స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు రెండు సంవత్సరాలకో సినిమా చేస్తుంటారు కాబట్టి వారికి హీరోయిన్ల కొరత వేధించదు. ఆ సమయానికి ఎవరో ఒకరు దొరుకుతారు. ఎందుకంటే వీరు రెగ్యులర్ గా సినిమా చేయరు. ఒక సినిమాకు, మరో సినిమాకు మధ్య కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకుంటుంటారు.

తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం శ్రీలీల దూసుకుపోతోంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె కాస్తంత విరామం తీసుకుంది. కుర్ర హీరోలతోపాటు స్టార్ హీరోలతో కూడా నటిస్తోంది. ప్రస్తుతం హీరోలు, నిర్మాత దర్శకులు కొత్త హీరోయిన్ల కోసం ఎదురుచూస్తుండా వారికి భాగ్యశ్రీబోర్సే రూపంలో వరం దొరికినట్లైంది. రవితేజ, హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్, సుజిత్ దర్శకత్వంలో నానితో మరో ప్రాజెక్టుకు సంతకం చేసింది. ఇవన్నీ భాగ్యశ్రీకి కలిసిరానున్న సినిమాలే అవుతున్నాయి.

telugu film industry new heroine Bhagyashri Borse

కాకపోతే తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన మనస్తత్వం కలిగినవారు. వారికి ఎవరు నచ్చుతారో, ఎవరు నచ్చరో ఒక పట్టాన అర్థంకాదు. ప్రస్తుతానికి ఈమె సంతకాలు చేసిన సినిమాలనుబట్టి చూస్తే అందాల ముద్దుగుమ్మ శ్రీలీలకు ప్రత్యామ్నాయం దొరికినట్లేనని భావిస్తున్నారు. యంగ్ హీరోలతోపాటు స్టార్ హీరోలకు సరిపోయే హీరోయిన్లు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం. శ్రీలీల రాత్రికి రాత్రే పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అన్ని పాత్రలకు సరిపోవడంలేదంటున్నారు. రష్మిక నేషనల్ క్రష్ అయిన తర్వాత పెద్దగా అందుబాటులోకి రావడంలేదు. ఇటువంటి తరుణంలో భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+