రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హీరో సినిమా
ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా తెలుగు హీరో నటించిన ఓ సినిమా ఓటీటీకి రెడీకి అవుతోంది.
'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'.మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ గోదాల దర్శకత్వం వహించారు.ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీ జులై 11న థియేటర్స్‌లోకి విడుదలైంది. 'ఓ భామ అయ్యో రామ'కు సరైన ప్రమోషన్స్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. దీంతో ఈ సినిమా వచ్చిందని చాలామందికి తెలియలేదు.

ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఓ భామ అయ్యో రామ" సినిమా ETV Win ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఆగస్టు 1, 2025 నుండి స్ట్రీమింగ్ కానుంది. 'ఆమె అతను కోల్పోయిన కలలను తిరిగి తెచ్చింది. అంతేకాకుండా లోతైన గాయాలు కూడా తీసుకువచ్చింది' అనే క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications