బాలీవుడ్ మాఫియాను తొక్కిపట్టిన ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ సలార్ సినిమాతో రూ.725 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాపయినప్పటికీ 80 శాతం రికవరీ సాధించి 20 నష్టాలను మాత్రమే చవిచూసింది. ఈ సినిమా ఫ్లాపైన తర్వాత ప్రభాస్ అంటే కక్షగా ఉన్న కొందరు బాలీవుడ్ హీరోలు ఓ మాఫియాగా మారి ప్రభాస్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే డార్లింగ్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
వీటిని ఏమాత్రం ఖాతరు చేయని ప్రభాస్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమా డంకీకి సలార్ ను పోటీగా దింపారు. ఈ పోటీలో సలార్ భారీ కలెక్షన్లు కొల్లగొట్టగా డంకీ చిత్రం పరాజయం పాలైంది. తనను తక్కువ అంచనా వేస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ మాఫియాకు రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బను రుచిచూపించడాంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభాస్ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. తను ఇచ్చిన ప్రోత్సాహంతోనే దక్షిణాది నుంచి ఎంతోమంది హీరోలు బాలీవుడ్ లో తమ హవాను చూపించేలా సినిమాలు విడుదల చేస్తున్నారు.

ప్రభాస్ క్రేజ్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు ఉత్తరాదిలో సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయారు. దక్షిణాది నుంచి వచ్చి ఇలా తమపై ఆధిపత్యం చూపిస్తున్న డార్లింగ్ ను నియంత్రించేందుకు బాలీవుడ్ మాఫియా ఎన్నో ప్రయత్నాలు చేసిందికానీ ఓటమిపాలైంది. ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ వాటితో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ ను ఏవిధంగా నియంత్రించాలా? ఏవిధంగా తొక్కాలా ? అనే ఆలోచనల్లో, ప్రయత్నాల్లో మాఫియా ఉంది. ఇదీ బాలీవుడ్ సంగతి.












Click it and Unblock the Notifications