గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న తెలుగు హీరోయిన్

సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు..

గతంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచార ఆరోపణలతో కెరీర్‌ను చేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారిలో గ్లామర్ డాల్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకరు. 2002లో మక్డీ అనే బాలీవుడ్ సినిమాతో శ్వేతా బసు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో ఆఫర్లు దక్కించుకుంది.

Telugu heroine who has reached a stage of unrecognizability

తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో యూత్ కలల రాణిగా శ్వేతా బసు నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చివేసింది. దీంతో శ్వేతా బసు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ స్టార్ హోటల్‌లో ఓ వ్యక్తితో పట్టుబడింది. దాంతో పోలీసులు ఆమెను వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చెయడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

శ్వేతా బసును అరెస్ట్ చేసిన సమయంలోనే ఆ రాకెట్ కు సూత్రధారి అయినా అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడ తనపై తప్పుడు ఆరోపణలు చేసారంటూ శ్వేతా బసు అవేదం వ్యక్తం చేశారు.. ఆతర్వాత కొన్ని నెలలకు ఆమెకు పోలీసులు కూడా క్లిన్ చిట్ ఇచ్చారు.. కానీ అప్పటికే ఆమె కెరీర్‌పై ఈ ఘటన ప్రభావం బాగా పడింది. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక 2018లో ఆమె ప్రేమించి ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకోగా కేవలం 9 నెలల సమయంలోనే ఆమె అతనితో విడాకులు తీసుకుంది.

ఇలా స్టార్ హీరోయిన్ కావాల్సిన శ్వేతా బసు ఒక్క ఘటనతో తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితం కూడా ఆమె చాలా కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా శ్వేతా బసు తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శ్వేతా బసు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. శ్వేతా బసు లుక్స్ మొత్తం మారిపోయాయి. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన త్రిష ఇంకా అలానే ఉన్నప్పటికీ, శ్వేతా బసు మాత్రం తన గ్లామర్ లుక్స్ మొత్తం పోగొట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+