జానీ మాస్టర్‌పై హీరో భార్య సంచలన కామెంట్స్.. రేప్ చేయడానికి అనుమతి ఇచ్చినట్టే

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు గురించి తెలిసిన విషయమే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. పోలీసులు సైతం అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడిన సాక్ష్యాలను సేకరించారు. దీంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడటం కష్టమే అనుకున్నారంతా.

మొత్తానికి ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్న జానీ మాస్టర్ తిరిగి పలు సినిమాలకు కొరియాగ్రఫీ చేస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూక' వంటి సినిమాలకు ఆయన పని చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో & దర్శకుడు రాహుల్ భార్య , ప్రముఖ సింగర్ తనదైన శైలిలో స్పందించారు. చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చిన్మయికి మంచి గుర్తింపు ఉంది.

Telugu Hero s wife s sensational comments on Johnny Master

ముఖ్యంగా హీరోయిన్ సమంతకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్‌తోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిందంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో చిన్మయి సైతం తన వ్యక్తిగత వ్యాఖ్యాలతో నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటుంది. లైంగిక వేధింపుల గురించి చిన్మయి పెద్ద పోరాటమే చేస్తోంది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు గురించి మొదట స్పందించే సెలబ్రిటీ చిన్మయినే. తాజాగా ఆమె జానీ మాస్టర్‌తో పాటు సింగర్ కార్తీక్‌‌కు అవకాశాలు ఇవ్వడంపై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ వంటి వాళ్లకు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు అనుమతి ఇచ్చినట్టే అని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారం , డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే ..లైంగిక వేధింపులకు నా మద్దతు ఉందని నేరుగా చెప్పడం లాంటిదే. కర్మ సిద్ధాంతం ఉంటే .. అది తిరిగి వచ్చి వారిని తిరిగి కొరుకుతుంది. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. కర్మ అసలు ఎవరినీ వదిలిపెట్టదని చిన్మయి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా.. ఇటీవల కార్తీక్, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+