హీరోయిన్ అంజలితో ఎఫైర్‌పై తెలుగు నిర్మాత ఓపెన్ కామెంట్స్
హీరోయిన్ అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా 'ఫొటో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. 'కరతు' తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే కుటుంబ గొడవలతో కొన్నేళ్ళ సినిమాలకు దూరం అయింది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు కలిసి సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాకిచ్చింది. హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది.

ఆ తర్వాత సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా అవకశాలు దక్కలేదు. అయితే ఇటీవల తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో కూడా అంజలి కీలక పాత్రలో నటించింది.ఇదిలా ఉంటే అంజలి గురించి ఆ మధ్య ఓ రూమర్ తెగ వైరల్ అయింది. అంజలి త్వరలోనే ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట వైరల్ అయింది.ఇప్పటికే తన భార్యతో విడిపోయిన ఓ తెలుగు ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకోబోతుందని ..ప్రొడ్యూసర్‌తో అంజలి పీకల్లోతు ప్రేమలో ఉందని.. త్వరలో పెళ్లితో ఒక్కటి అవ్వడమే ఆలస్యం అన్నట్టుగా అనేక కథనాలు వైరల్ అయ్యాయి.
ఆ నిర్మాత మరెవరో కాదు కోన వెంకట్. ఆయన కథ రచయిత అనే విషయం తెలిసిన విషయమే. అయితే ఆయన అంజలి హీరోయిన్‌గా గీతాంజలి అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా సమయంలో కోన వెంకట్ అంజలికి కారు కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో వీరిద్దరి రిలేషన్ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఈ ప్రచారంపై కోన వెంకట్ స్పందించారు.అంజలితో ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి విషయాలపై వినిపిస్తున్న రూమర్స్, గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు.అంజలి వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికి తెలుసని.. తన బాల్యం సంతోషకరంగా సాగలేదని చెప్పారు. అంజలి పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదని.. పిన్ని దగ్గరే పెరిగిందని.. పైగా ఆ పిన్నే తనను ఎన్నో బాధలకు గురిచేసి మోసం చేసిందంటూ చెప్పాడు. ఆ సమయంలో తాను ఆమెకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications