'రానూ బొంబాయికి రానూ'.. 80 కోట్ల వ్యూస్ తో.. దీన్ని కొట్టే సాంగ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్ మెంట్..!!

తెలంగాణ జానపద గీతాలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల నుంచి నేటి వరకూ జానపద గీతాలు తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. బతుకమ్మ పాటలు తెలంగాణ జానపద సాహిత్యంలో అత్యంత విశిష్టమైనవిగా చెబుతారు. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణ జానపద గీతాలు యూట్యూబ్ లో దూసుకెళ్తున్నాయి. 'ఊరుగెళ్లే జింక'.. 'వంగామూరి కొండల్లో'.. 'రాను బొంబాయికి రాను' వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో ముఖ్యంగా 'రాను బొంబాయికి రాను' సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ పాటకు ఇప్పటివరకూ 800 మిలియన్ వ్యూస్ రావడం ఓ రికార్డు. అంటే 80 కోట్లమంది ఈ పాటను చూశారు.

పెళ్లిళ్ల దగ్గర్నుంచి ఏ ఫంక్షన్ అయినా.. ఇతర సందర్భాల్లోనూ ఈ పాట ఉండాల్సిందే. అంతలా ప్రజల్లో నాటుకుపోయిన పాట 'రాను బొంబాయికి రాను'.. 2025 లో రిలీజ్ అయిన ఈ జానపద గేయాన్ని రాము రాథోడ్ అనే వ్యక్తి స్వయంగా రాసి పాడటం ఆశ్చర్యకరం. ప్రస్తుతం సినిమా పాటల కంటే ఇలాంటి పాటలకే ఎక్కవ క్రేజ్ పెరుగుతోంది. సినిమా పాటల్లో అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తుంటే.. జానపద గేయాల్లో ఈ సాంగ్ 800 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.

Telugu song YouTube Ranu Bombayki Ranu Achieves 800 Million Views Setting New YouTube Milestone

ఇక 'రాను బొంబాయికి రాను' పాటను చేసింది రాము రాథోడ్.. ఇతను మహబూబ్ నగర్ జిల్లా బూత్ పూర్ మండలం గోపాల్ పూర్ తండాకు చెందినవాడు. చిన్నవయసు నుంచే సంగీతం, డాన్స్ పై ఆసక్తి ఉన్న రాము మొదట్లో పెళ్లి భారత్ లో డాన్సులు వేసేవాడు. అలా ఫోక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాడు రాము. అయితే ఈ ఒక్క పాటతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాము రాథోడ్.. బిగ్ బాస్ సీజన్ 9 లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇటీవల బ్యాండ్ మేళం సినిమాలో ఓ పాటకు ఆడి పాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం మరికొన్ని పాటలను సిద్ధం చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+