భారీగా పెరిగిన ఆస్తుల విలువ.. టాప్-10 ధనవంతుల్లో ఒకడిగా
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ సంపదను కూడగడుతున్నారు. 2022లో తన తాన అల్లు రామలింగయ్యకు నివాళిగా హైదరాబాద్ లో అల్లు స్టూడియోను ఏర్పాటు చేశారు. 10 ఎకరాల స్థలంలో ఫిల్మ్ మేకింగ్, కమర్షియల్ ప్రొడక్షన్, టెలివిజన్ పరిశ్రమ కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
వివిధరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు
సినిమాలు, ప్రకటనలు, ఫిలిం స్టూడియో, ప్రొడక్షన్ హౌస్, ఖరీదైన ఇల్లు, స్థలాలు, ఆహా ఓటీటీ, ఇతర వ్యాపారాలు, కార్లు.. ఇలా ఆస్తిని కూడగట్టిన అల్లు అర్జున్ టోటల్ ప్రాపర్టీ వాల్యూ రూ. 460 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. అమీర్ పేటలో మల్టీప్లెక్స్ నిర్మించి అందులోకి కూడా ప్రవేశించారు. ఏఏఏ పేరుతో దాన్ని పున:ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టారు.

జాగ్రత్తగా ప్రణాళికల అమలు
అనేక కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో కంటెంట్ అందిస్తున్న ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పెట్టుబడుల విషయంలో తనదైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. హెల్త్ కేర్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. కాల్ హెల్త్ సర్వీసెస్ లో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ కు చెందిన ఈ కంపెనీ నర్సింగ్ కేర్, మెడిసిన్ డెలివరీ, ఆన్ లైన్ కన్సల్టేషన్లు అందిస్తోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు రోజురోజుకు ఫాలోయింగ్ పెరుగుతోంది. 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసినందుకు ఆదాయం వస్తుంది. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటిద్వారా సంపదను ఆర్జించి త్వరలోనే రూ.500 కోట్లకు చేరుకుంటాడని అంచనా వేస్తున్నారు. నికర ఆస్తులను కలిగివున్న హీరోగా తనకంటూ ఓ చరిత్రను అల్లు అర్జున్ సృష్టించుకున్నారు.












Click it and Unblock the Notifications