సినిమాలకు గుడ్ బై చెప్పనున్న తెలుగు స్టార్ హీరో?
వేణుస్వామి... ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలోను, సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతుంటారు. అలా చెబుతూ చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీగా మారిపోయారు. మారిపోయారు అనేదానికన్నా ఆయన్ను ఆయనే ఒక సెలబ్రిటీలా మార్చుకున్నాడు. ఆయన చెప్పిన విషయాల్లో ఏదైనా జరిగిందా? అంటే అది ఒక్కటే.. సమంత-నాగచైతన్య విడిపోవడం. అప్పటి నుంచి వేణుస్వామి గతంలో ఏం చెప్పాడు? అనే విషయాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా ఆయనొక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న విషయం ప్రకారం.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ ఏడాదికానీ, వచ్చే ఏడాది కానీ సదరు హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు అని వేణుస్వామి జాతకం చెప్పారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులవల్ల చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించనున్నారని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఆ హీరో ఎవరంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన కెరీర్ అయిపోయిందని, ఆయన సినిమాలేవీ ఆడవంటూ వేణుస్వామి ఒకటే ప్రచారం చేస్తున్నారు. అయితే డార్లింగ్ అభిమానులకు ఈయన దొరికితే మాత్రం దబిడి దిబిడే అంటున్నారు. ప్రభాస్ ఏ సినిమా చేసినా ఆడదు.. ఫ్లాప్ అంటూ వేణుస్వామి చెబుతూ వస్తున్నారు. కానీ సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి వేణుస్వామి ఏం సమాధానం చెబుతాడంటూ ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే బాహుబలి తర్వాత నాలుగు సినిమాలు చేస్తే మూడు ఫ్లాపయ్యాయని, సలార్ ను సక్సెస్ అంటారా? అంటూ డార్లింగ్ అభిమానులపై వేణుస్వామి రివర్స్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications