నీ ఆస్తి మొత్తం నా బాత్రూం ఖరీదు చేయదు.. హీరోయిన్ పై హీరో ఆగ్రహం
అందాల నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ప్రస్తుతానికి మన మధ్య లేకపోయినప్పటికీ ఎన్నో సినిమాలద్వారా చిరస్థాయిగా నిలిచేవుంటారు. కుటుంబ కథాచిత్రాలు ఎక్కువగా చేయడంతో మహిళా అభిమానులను బాగా సంపాదించుకున్నారు. దాదాపుగా ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం అనేది సాధారణంగా మారింది. పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరుగా మారిపోయినప్పటికీ క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత, సమయ పాలనను బాగా అనుసరిస్తారు.
ఓ సినిమా షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ నగ్మాకు శోభన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నగ్మా అగ్రహీరోలందరి సరసన నటించింది. తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. శోభన్ బాబు-నగ్మా కలయికలో అడవిదొంగ పేరుతో సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పాట తీసేందుకు ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లారు.

సెట్స్ లో హీరో, దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్, కెమెరామెన్ తోపాటు చిత్ర యూనిట్ అంతా ఎదురుచూస్తున్నప్పటికీ నగ్మా మాత్రం షూటింగ్ కు రాలేదు. రెండుగంటలకు పైగా ఆలస్యంగా వచ్చింది. అందరూ ఆమెకోసం ఎదురుచూశారు. తీరిగ్గా సెట్స్ కు వచ్చిన తర్వాత శోభన్ బాబు నగ్మాను ఎక్కడికి వెళ్లావని అడిగారు. దీంతో నేరుగా సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానం చెప్పింది.
దీంతో శోభన్ బాబుకు మండిపోయింది. నీ ఆస్తి ఎంత ఉంటుందని అడగ్గా నగ్మా సమాధానం చెప్పింది. అదంతా విన్న తర్వాత నా ఇంట్లో ఉండే బాత్రూమ్ ఖరీదు కూడా నీ ఆస్తి విలువ చేయదు.. మొదట క్రమశిక్షణ గా ఉండటం నేర్చుకో.. తర్వాత సమయాన్ని అనుసరించు.. పనిమీద శ్రద్ధ లేకపోతే ఎప్పటికీ విజయం సాధించలేవని క్లాస్ పీకారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications