ప్రకాష్ రాజ్.. కొంచెం తగ్గు... స్టార్ హీరో గట్టి వార్నింగ్!
విలక్షణ నటుడు, తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో సినిమాలను తన అద్భుతమైన నటనా చాతుర్యంతో సూపర్ హిట్లుగా మలిచారు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేదికాదు. ఇప్పుడిప్పుడే సినిమాలు తగ్గించుకుంటున్నారుకానీ వాస్తవానికి ఏ పాత్రలోకైనా ఆయన అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తారు. బాలచందర్ భారతదేశ సినీపరిశ్రమకు అందించిన మరో ఆణిముత్యం ప్రకాష్ రాజ్. ప్రతి దర్శకుడు ప్రకాష్ రాజ్ ను దృష్టిలో ఉంచుకొని కథను రాసుకోవడంతోపాటు పాత్రను సృష్టించేవారు. ఆయన నటనవల్ల ఎంతోమంది స్టార్ హీరోలయ్యారు.
ఎందుకలా ఆవేశపడుతున్నావ్
కెరీర్ ప్రారంభించిన మొదట్లో ప్రకాష్ రాజ్, తెలుగువారి అందాల అభిమాన నటుడు శోభన్ బాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 1995లో శోభన్ బాబు హీరోగా నటిస్తున్న దొరబాబు చిత్రంలో ప్రకాష్ రాజ్ కు అవకాశం వచ్చింది. పోరాట సన్నివేశాల సమయంలో ప్రకాష్ రాజ్ ఎంతో ఆవేశంగా శోభన్ బాబును తన్నేందుకు ఆవేశంగా పైపైకి వచ్చారు. అప్పుడు శోభన్ బాబు ప్రకాష్ రాజ్ ను తగ్గు.. తగ్గు.. ఎందుకు అలా ఆవేశపడుతున్నావు.. ఇది కేవలం నటన మాత్రమే.. నిజ జీవితం కాదు.. నేను నీకు ఏమీ అన్యాయం చేయలేదు అని మాట్లాడుతూ తియ్యటి హెచ్చరిక చేశారు.

ప్రకాష్ రాజ్ కు ఒక మాట చెప్పిన శోభన్ బాబు
ఈ సినిమా షూటింగ్ పూర్తికావస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ కు శోభన్ బాబు ఒక మాట చెప్పారు. రెండు సంవత్సరాల తర్వాత నన్ను ఒకసారి కలుస్తావా? అని అడిగారు. అదేంటి గురువుగారు.. నేను మిమ్మల్ని కలవకుండా ఎలా ఉంటాను అన్నారు. సరే నేను తేదీ గుర్తుంచుకుంటాను.. అన్నారు శోభన్ బాబు. నన్ను మీరు కలవరు.. ఎందుకంటే మీరు బిజీ అయిపోతారు.. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటారు అన్నారు. శోభన్ బాబు చెప్పినట్లుగానే రెండు సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ ఆయన్ను కలవలేకపోయారు. అనుకోకుండా ఓచోట కలిసినప్పుడు బిజీగా ఉండి కలవలేకపోయాను గురువుగారు.. ఏమీ అనుకోవద్దు అని చెప్పారు. నేను ఆరోజే చెప్పానుకదా.. నువ్వు బాగా బిజీ ఉన్న హీరో అవుతావు అని శోభన్ అన్నారు.












Click it and Unblock the Notifications