టైం చూసి విజయ్ దేవరకొండను తొక్కుతున్న స్టార్ డైరెక్టర్లు?

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీస్టార్ విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. సినిమా ఫ్లాప్ అనే విషయంకన్నా విజయ్ దేవరకొండ చిత్రం అనగానే వ్యతిరేకత ప్రారంభమవుతోంది. కొందరు సోషల్ మీడియాలో అలా ప్రచారం చేయిస్తున్నారనే వార్తలు కూడా కొద్దిరోజుల నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది.

విజయ్ తో ఓ సినిమా చేయనున్నట్లు దర్శకుడు సుకుమార్ కొంతకాలం క్రితం ప్రకటించారు. అయితే అది వాయిదా పడింది. ప్రస్తుతం అదే కథతో రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విజయ్ తో సినిమా చేసేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నాడుకానీ ఎందుకు పట్టాలెక్కలేదో దర్శకుడు, హీరోకే తెలియాలి. అగ్ర దర్శకులు చాలామంది కొంతకాలం క్రితం రౌడీహీరోతో సినిమాలు చేయడానికి మొగ్గుచూపారు. కథలను కూడా సిద్ధం చేశారు. అవి చేసుంటే ఈ సమయానికి అగ్ర స్థాయి కథానాయకుడిగా మారేవాడు.

telugu star hero vijay devarakonda latest movie updates

దురదృష్టం వెంటాడటంతో ఆ సినిమాలు పట్టాలెక్కలేదు. లైగర్ పరాజయం విజయ్ కెరీర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఖుషీ కూడా ఓ మాదిరిగా ఆడిందేకానీ అందరినీ మెప్పించలేకపోయింది. స్టార్ దర్శకులు ఎందుకు విజయ్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడంలేదు అనేది ఇప్పుడు ప్రధాన వార్తగా మారింది.

స్టార్ హీరోలకు పోటీగా ఎదుగుతాడని భావించిన కొందరు ఆ విషయంలో అగ్ర స్థాయి దర్శకులపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో వారంతా కాస్తంత వెనకడుగు వేస్తున్నారని, అదే కథలతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా గతంలో విజయ్ తో సినిమా చేయాల్సి ఉంది.

కొందరు స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్లకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో హీరోల మాటలను దర్శకులు కాదనలేకపోవడానికి తెరవెనక కూడా కొన్ని కారణాలున్నాయంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ స్టార్ హీరోలకు విజయ్ దేవరకొండ పోటీగా రానున్నాడనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు మాత్రం అతనికి మంచి సినిమాలు పడకుండా చూస్తున్నారంటూ పరిశ్రమలో అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+