సాయిపల్లవికి 'నో' చెప్పిన తెలుగు స్టార్ హీరో!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి దక్షిణాది లోని అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచిపేరు సంపాదించుకుంది. తన నటనతోనే కాకుండా నృత్యాలతో కూడా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాల ఎంపికలో ఆచూతూచి వ్యవహరిస్తుంటుంది. పాత్రకు ప్రాధాన్యంతోపాటు ఆ పాత్రకు నటనలో కూడా ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సాయిపల్లవికి అన్ని భాషల్లో భారీసంఖ్యలో అభిమానులున్నారు. రొమాంటిక్ సీన్లలో నటించకుండా, రొమాంటిక్ డైలాగులు చెప్పకుండా ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటుంది.

కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాత, దర్శకులు చెప్పినప్పటికీ ఆ తరహా పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదు. అవసరమైతే ఎంత పెద్ద హీరో అయినా పాత్ర నచ్చకపోతే వెంటనే నో చెబుతుంది. ఈ విషయం పరిశ్రమలో అందరికీ తెలిసిందే. అలాంటి సాయిపల్లవికి తెలుగు స్టార్ హీరో ఒకరు నో చెప్పారు. తన సినిమాలో నటింపచేయడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఆ హీరో ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాకు ముందుగా సాయిపల్లివిని హీరోయిన్ గా అనుకున్నారు. పాత్ర ఎంతో సాంప్రదాయబద్దంగా ఉన్నప్పటికీ సాయిపల్లవి వద్దని చెప్పారంట.

telugu star hero vijay devarakonda rejected saipallavi

ఎంత ఫ్యామిలీ పాత్ర చేస్తున్నప్పటికీ అందులో ఎంతోకొంత రొమాన్స్ ఉండాలి. అది లేకపోతే ఆ పాత్ర పండదు. దానికి గుర్తింపు రాదు. అటువంటి సీన్లను కూడా సాయిపల్లవి చేయనని చెబుతుంది. అందులో ఎటువంటి సందేహం అవసరంలేదు. అడిగి నో అనిపించుకోవడంకన్నా మనమే వద్దనుకుంటే సరిపోతుందికదా అని విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్ తో అన్నారంట. సాయిపల్లవి వద్దని మేకర్స్ కు కూడా చెప్పారంట. అనుకున్న విధంగానే నిర్మాత, దర్శకుడు సాయిపల్లివి బదులు మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారు. ఫ్యామిలీస్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ-మృణాల్ జంట బాగుందని అందరూ అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత తెరపై వీరి జంట ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+