పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న తెలుగు హీరో
సౌత్‌లో ఇప్పుడు దర్శకుడు అంటే అందరూ రాజమౌళి గురించి చెప్పుకుంటున్నారు కానీ..ఐదారేళ్ల క్రితం వరకు స్థానంలో తమిళ దర్శకుడు శంకర్ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. శంకర్ సౌత్‌లో టాప్ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. భారీ చిత్రాలకు మారు పేరుగా నిలిచారాయన. సందేశాత్మక చిత్రాలను తనదైనశైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్ , జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. శంకర్‌తో సినిమాలు చేయడానికి హీరోలు ఎదురు చూసే పరిస్థితి. అలాంటిది శంకరే నేరుగా వెళ్లి అడిగిన అతని సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఒకరున్నారనే విషయం మీకు తెలుసా. ఇంతకీ శంకర్ సినిమా రిజెక్ట్ చేసిన హీరో మరెవ్వరో కాదు అబ్బాస్. శంకర్ దర్శకత్వంలో జీన్స్ సినిమాలో మొదట అబ్బాస్‌ని హీరోగా పెట్టాలని అనుకున్నాడట శంకర్.

అబ్బాస్ అయితే ఆ స్క్రిప్ట్‌కి చాలా బాగుంటుందని అనుకున్న శంకర్ అతనికి కథ వినిపించాడట. అయితే కథ నచ్చినప్పటికీ శంకర్ సినిమా నుంచి అబ్బాస్ తప్పుకున్నాడు. అంతకుముందే కొన్ని సినిమాలు కమిట్ అవ్వడంతో శంకర్ సినిమాను చేయలేకపోయాడు దీంతో చేసేది లేక జీన్స్ సినిమాని వదిలేసుకున్నాడు. ఇక మొత్తానికైతే జీన్స్ సినిమాలో ప్రశాంత్‌ను హీరోగా పెట్టి ఆ సినిమాను తెరకెక్కించాడు.
ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అబ్బాస్ ఈ సినిమాను వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తరువాత కొద్దికాలానికే అవకాశాలు లేక అబ్బాస్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యాడు. జీన్స్ సినిమా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని అబ్బాస్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఫీల్ అయ్యాడు. ఆయన ఇండస్ట్రీని వదిలేసిన అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లి కొద్దిరోజులు పెట్రోల్ బంక్‌లో పని చేశాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు.
-
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ..












Click it and Unblock the Notifications